హిందూ దేవత యొక్క శక్తి కి నిదర్శనం...!

హిందూ దేవత యొక్క శక్తి కి నిదర్శనం...!


మనుషుల కలలోకి పూర్వం దేవుళ్ళు రావడం.. వాళ్ళు చెప్పిన చోట వెతికినప్పుడు విగ్రహాలు బయటపడడం చాలా చోట్ల మనం వినడమో,చదవడమో చేసే ఉంటాం. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.     

రఘునాథపాలెం మండలం జాన్‌ బాద్‌ తండాలో జరిగిన ఈ ఘటన గురించి వింటే.. నిజంగా ఆశ్చర్యం కలుగకమానదు. ఏనుగుల ఉపేంద్రమ్మ అనే మహిళకు గత కొన్ని నెలలుగా బానోతు వెంకన్న అనే వ్యక్తికి చెందిన పొలంలో దుర్గామాత కొలువై ఉన్నట్టు కలలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వెంకన్నకు పలుమార్లు చెప్పినా, అతడు పట్టించుకోలేదు. నమ్మలేదు కూడానూ..! అయితే  ఆమె మాత్రం వెంకన్నతో చెబుతూనే ఉంది. చివరికి వెంకన్న ఒప్పుకున్నాడు.      

పలువురి సమక్షంలో తవ్వకాలు జరిపించాడు. అయితే ఆమె చెప్పిందే నిజం అయింది.. తవ్వకాల్లో ఓ దుర్గామాత విగ్రహం బయటపడింది. స్వయంభూ గా వెలిసిందని ప్రజలు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ గుడి కడతామని వారు స్పష్టం చేశారు. పురావస్తు అధికారులకు కూడా విషయం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి.