గ్రామీణ మహిళా విద్యార్థులకు విప్రో సంస్థ ” సంతూర్ స్కాలర్ షిప్ ” పథకాన్ని ప్రవేశ పెట్టింది . ఆర్థిక స్తోమత లేక గ్రామాలలో ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేస్తుంటారు . ఈ నేపథ్యంలో వారికి ఆసరా ఇవ్వాలని సంతూర్ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. ఈ పథకం కేవలం ప్రభుత్వ కళాశాలలో చదివిన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం 2016 – 17 వ సంవత్సరంలో ప్రారంభించి, ప్రతి యేటా 900 మంది విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ పథకం క్రింద 2700 మంది లబ్ధి పొందారు. ప్రతి యేటా విద్యార్థికి 24000 రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలు అందిస్తారు.
అర్హతలు :
* ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , కర్నాటక రాష్ట్ర నివాసులు మాత్రమే అర్హులు.
* ఆర్థికంగా వెనుకబడిన మహిళా విద్యార్థినులు మాత్రమే అప్లై చేసుకోనుటకు అర్హులు.
* పదవ తరగతి ప్రభుత్వ స్కూల్లో మాత్రమే చదివి వుండాలి.
* ఈ పథకానికి 2018-19 వ సంవత్సరంలో .ఇంటర్ ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
* 2018-19వ సంవత్సరంలో ఫుల్ టైమ్ ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినిలకు మాత్రమే అవకాశం.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15 జూలై 2019
అప్లికేషన్ చివరి తేదీ : 15 ఆగష్టు 2019
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
http://www.santoorscholarships.com/documents/str-women-scholarship-application-form-2019-20.pdf
అప్లికేషన్ ను ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.
http://www.santoorscholarships.com/documents/str-women-scholarship-application-form-2019-20.pdf