ఈ రోజు స్వామి ప‌రిపూర్ణానంద గారు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి లో నారాయణ బలి శాంతి హోమం నిర్వహించారు.













ఆంజనేయ స్వామి కొలువై ఉన్న‌ కొండగట్టులో ఈ రోజు స్వామి ప‌రిపూర్ణానంద ఆధ్వ‌ర్యంలో నారాయణ బలి శాంతి హోమం నిర్వహించారు. బ‌స్సు ప్ర‌మాదంలో మృతి  చెందిన వారి ఆత్మ‌శాంతి కోసం ఈ నారాయ‌ణ‌బ‌లి హోమ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. నారాయణబలి హోమం కోసం పరిసరాలను గోపంచకంతో శుద్ది చేశారు. హోమ స్థలిలో హోమ నిర్వహణ కోసం స్వామీజీ పలు సూచనలు చేశారు. అక్కడకు చేరుకున్న స్వామీజీని చూసి మృతుల బంధువులు కొండగట్టు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో స్వామీజీ బాధిత కుటుంబాలను ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఓదార్చుతూ పరామర్శించారు. స్వామీజీ కూర్చోడానికి సింహాసనం ఏర్పాటు చేయ‌గా, అందుకు స్వామీజీ నిరాక‌రించి వారితో పాటు కింద‌నే కూర్చున్నారు. అనంతరం వేద మంత్రాలతో, శ్లోకాలతో హోమాన్ని ప్రారంభించారు. దీంతో శోక్లాలు, వేద మంత్రాలతో హోమస్థలి మారుమోగింది. మృతుల, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రాలతతో అత్యంత శాస్త్రోక్తంగా నారాయణ బలి హోమాన్ని నిర్వహించారు.